Friday, May 10, 2013

గమనిక:
మీ అభివృద్ధికి మీరే కారణం, మీరు నా ప్రయత్నం వలన బాగు పడితే అది నా బాధ్యత కాదు,
పొరపాటున అలా జరిగితే అది పూర్తిగా యాదృశ్చికం
 నాది ప్రయత్నం మాత్రమే!, మీ అభివృద్ధి, దాని వలన ఫలితం పూర్తిగా మీది

 (సారాంశం: కనుక మీ అభివృద్ధికి బాట మీరే వేసుకోవాలి, ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించరు)

Monday, September 19, 2011

drop_cache

To clear Caches in RAM on Linux

To use /proc/sys/vm/drop_caches, just echo a number to it.

To free pagecache: # echo 1 > /proc/sys/vm/drop_caches
To free dentries and inodes: # echo 2 > /proc/sys/vm/drop_caches
To free pagecache, dentries and inodes: echo 3 > /proc/sys/vm/drop_caches

This is a non-destructive operation and will only free things that are completely unused. Dirty objects will continue to be in use until written out to disk and are not freeable. If you run "sync" first to flush them out to disk, these drop operations will tend to free more memory.

Refer: http://linux-mm.org/Drop_Caches

Saturday, March 13, 2010

సాధించాను - కోల్పోయాను

ఎన్ని సంఘర్షణలో, ఎన్నిఅలజడులో, ఎన్ని ఉషస్సులో, ఎన్ని అగాధాలో
నీ నిరీక్షణ లో ఎన్ని యుగాలు గడిపానో గుర్తే లేదు
నీ ధ్యాసలో విషమే తాగానో, అమృతమే తాగానో ధ్యాసే లేదు
నిన్ను చేరేందుకు ఎన్ని వేల యోజనాలు నడిచానో తెలియదు
నీ మనసును చేరేందుకు ఎన్నిమేఘాలు ఎంతగా వర్షించెనో..
నీ వలపు దాహం తో ఎన్ని సాగరాలు తాగానో తెలియదు
నీ ఎడబాటు లో ఎంత తీవ్రంగా కాలానో గుర్తే లేదు
నా ప్రేమను తెలిపేందుకు ఎన్ని మేఘ సందేశాలు పంపానో
ఎంత మదనమో, మరెంత రుధిరమో,
ప్రాణం తృణమై ఎగసెను నీ ఊహలో
నీ ధ్యాసలో ఏం సాధించానో ఏం కోల్పోయానో మాత్రమే తెలుసు
నీలో కోల్పోయిన నన్ను సాధించాను, నేనే నువ్వైన నిన్ను కోల్పోయాను

ఉన్నా, అలజడిలో

నువ్వే పంచభూతాలై,
నా ఆయువుకి వాయువై,
నన్ను నీలో దాచుకున్న నింగివై,
నిన్ను చేరే దారే నేలై,
ప్రేమామృతమే నీరై,
నీకై కలిగిన కోరికే నిప్పై జీవిస్తున్నా,
నువ్వు ప్రేమై వర్షిస్తుంటే,
ఆ జడి లో, అలజడిలో తడిసి ముద్దౌతున్నా, ఉన్నా

నీ ధ్యాస

నిన్ను ప్రేమించినంతగా అందర్నీ ప్రేమించాను,
నిన్ను అందరితో సమానంగా చూశానని కాదు
అందర్నీ నిన్ను ప్రేమించినంతగా ప్రేమించాను
ప్రేమలో చాలా ప్రేమ కొంచెం ప్రేమ లేదు,
నా ప్రేమ కి హద్దే లేదు,
నువ్వు తప్ప ఇంకో ధ్యాసే లేదు

Saturday, February 20, 2010

వరం - శాపం

తనకొక శాపం ఉంది, తనని ప్రేమించే హృదయాన్ని తెలుసుకోలేదు,
తన వివరం తెలిస్తే నాకు తెలియచెప్పొద్దు,
ఈ నిశీధిని నిలువరించొద్దు, వెలుగును వెదచల్లొద్దు,
నాకు ఆయుష్షు శాపం,
నా ముక్తికి మార్గం చూపించు, నాకు మరణమనే వరం ప్రసాదించు

నిరాధారం

విత్తనం లేకుండా మొలకొస్తే
మబ్బులులేని వర్షం కురిస్తే
నిరాయుధమే ఆయుధమైతే
నేత్తురోడని యుద్ధం జరిగితే
దీపం లేని వెలుగొస్తే
ఈ క్షణమే లేక మరుక్షణం వస్తే
నీకు స్వాతంత్ర్యం వచ్చినట్టే
నీలో చైతన్యం వచ్చినట్టే
నీలో చీకటి చచ్చినట్టే
ఇకపై
జరిగేది సంస్కరణే
జరిగేది సంస్కరణే